మహారాష్ట్రాలో ప్లాస్టిక్ నిషేధం..

413
- Advertisement -

ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే..ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడేస్తున్నారు. అవగాహన లేమి ప్రత్యామ్మాయం లేకపోవడంతో ప్లాస్టిక్ ను మన నిత్య జీవితంలో భాగమైపోయింది.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదివరకూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నగర పాలక సంస్థలు ప్రకటించిన విధంగా కాకుండా మహారాష్ట్ర లో సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించింది. నోటిఫికేషన్ ప్రకారం తయారీ – వాడకం – అమ్మకం – పంపిణీ – ప్లాస్టిక్ మెటీరియల్ స్టోర్ చేసుకోవడం వంటి వాటన్నింటిని నిషేధించింది.

Plastic ban

పునర్వినియోగానికి వీలుకాని క్యారీబ్యాగ్‌లు, థర్మొకోల్ సహా అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం శనివారం నుంచి అమలులోకి వచ్చింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారికి రూ.5000 నుంచి రూ.25 వేల వరకు జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించనున్నారు. తమ నిర్ణయానికి అందరూ మద్దతునిస్తేనే ప్లాస్టిక్‌పై నిషేధం విజయవంతంగా అమలు జరుగుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను బాధ్యతాయుతంగా వినియోగించడాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామని, అందుకే సేకరణకు, క్రమబద్ధీకరణకు, పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్‌పై నిషేధం విధించామని సీఎం చెప్పారు.

Plastic ban

కాగా..ఒక్కసారి వినియోగానికే పనికివచ్చే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, చెంచాలు, ప్లేట్లు, పెట్, పీట్ బాటిళ్ల వంటి ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, అమ్మకం, సరఫరా, నిల్వ చేయడంపై నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరైనా నిషేధించిన వస్తువులను ఉత్పత్తి చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాందాస్ కదమ్ తెలిపారు. అయితే సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులపై మాత్రం వేధింపులుండవని స్పష్టం చేశారు. తమ వద్దనున్న నిల్వలను వదిలించుకొనేందుకు మూడు నెలల గడువునిచ్చామని అన్నారు.

- Advertisement -