తెలంగాణలో నేటి నుంచి ఫ్లాస్మా థెరపీ..

229
plasma therapy treatment in telangana from today
- Advertisement -

తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించనున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో 15 మంది ప్లాస్మా దానం చేసేందుకు ముందుకువచ్చారు. దీంతో వీరి నుంచి వైద్యులు రక్తం సేకరించనున్నారు. ఒక్కొక్కరి నుంచి 400 ఎం.ఎల్‌ రక్తం సేకరిస్తారు.

ఒక్కొక్కరి రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టే వకాశముంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ప్లాస్మాథెరపీ తీసుకునేందుకు అర్హులైన కరోనా రోగులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ప్లాస్మా సేకరించిన తరువాత గ్రహీత రక్తం మ్యాచ్ చేయడంతో ఓటు క్రాస్ మ్యాచ్ చేసిన తరువాతనే రోగికి ప్లాస్మా ఇవ్వనున్నారు వైద్యులు.

gandhi hospital

- Advertisement -