- Advertisement -
తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన బోయినిపల్లి వినోద్ కుమార్ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నేతలు వచ్చి ఆయనకు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ప్రముఖ ఆర్ధికవేత్త ప్రొఫెసర్, ప్లానింగ్ కమీషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రోఫెసర్ చెన్నమనేని హన్మంతరావును బేగంపేటలోని సెస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు వినోద్ కుమార్.
ఈసందర్భంగా వారి కలిసి చాలా సేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాల్లో ముందుకు పోతున్న తీరును హన్మంతరావు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
- Advertisement -