- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన జన్మదినం పురస్కరించుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధానంలో మొక్కలు నాటారు ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ బోయినిపల్లి వినోద్-మాధవి.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి… మొక్కలు నాటే విధంగా అందరిలో చైతన్యం కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. వారితో పాటు కుటుంబ సభ్యులు , కార్యకర్తలు, అభిమానులు , పాల్గొన్నారు
- Advertisement -