ప్లాను మారే.. బీజేపీ తీరూ మారే !

19
BJP
- Advertisement -

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ఏ స్థాయిలో ఉవ్విళ్లూరుతుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ప్రజలను ఆకర్శించేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తోంది కాషాయ పార్టీ. అధికార బి‌ఆర్‌ఎస్ పై ఘాటు విమర్శలు చేయడం, బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు ప్రణాళికలు రచించడం.. ఇలా శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికి ప్రజలు మాత్రం బీజేపీని నమ్మడం లేదు. ఆ పార్టీ చేస్తున్న ఏ కార్యక్రమానికి కూడా ప్రజా మద్దతు లభించడం లేదు. పార్టీని బలపరిచేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేసినప్పటికీ ఆశించినంత మైలేజ్ రాలేదనే చెప్పాలి.

ఇప్పటికే ఐదు విడతల్లో పాదయాత్ర కంప్లీట్ చేసిన బండి సంజయ్ కి ఏ దశలోనూ ప్రజా మద్దతు లభించలేదనేది ఇంటర్నల్ పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. అడుగడుగున ఆయనకు ప్రజల వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. కేంద్రం నుంచి నిధులను రాష్ట్రనికి తెప్పించడంలో బండి విఫలం అయ్యాడని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దల కాళ్ళ వద్ద ఉంచారని.. ఇలా రకరకలుగా బీజేపీ పైన, బీజేపీ చీఫ్ పైన ప్రజల నుంచి వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. దాంతో కొన్నాళ్లుగా పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చారు బండి సంజయ్ త్వరలో ఆరో విడత పాదయాత్ర చేపడతారనే వార్తలు వస్తున్నప్పటికి దీనిపై క్లాతిరి మాత్రం రావడం లేదు.

దీంతో బండి సంజయ్ పాదయాత్రకు పూర్తిగా బ్రేక్ ఇచ్చినట్లేననే గుసగుసలు వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పాదయాత్రకు బదులుగా రథయాత్ర చేపడితే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు ఆలోచిస్తున్నారట. ఇందుకు సంబంధించి పూర్తి ప్రణాళికలు కూడా రచించినట్లు సమాచారం. ఇప్పటికే అయిదు రథాలను సిద్దం చేశారని, ఏప్రెల్ తొలి వారంలో ఈ రథయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రథయాత్రను పార్లమెంట్ నియోజిక వర్గాల వారీగా చేపట్టే అవకాశం ఉందట. మరి ఈ రథయాత్రలో బీజేపీ పెద్దలు ఎవరెవరు పాల్గొంటారో చూడాలి. మొత్తానికి పాదయాత్రకు అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో రథయాత్ర వైపు మొగ్గు చూపుతున్న కమలనాథులకి.. రథయాత్ర అయిన సంతృప్తినిస్తుందో. లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి…

అదానీ,అంబానీల కోసమే గ్యాస్ ధరల పెంపు..

ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పొత్తు.. ఆ పార్టీలతోనేనా?

- Advertisement -