కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు పీయూష్ గయల్. కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ ..అరుణ్‌జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఆర్థికశాఖను తాత్కాలికంగా ఆయనకు అప్పజెప్పడం ఇది రెండోసారి.
ఫిబ్రవరి 1న అరుణ్ జైట్లీ స్థానంలో పీయూష్ గోయల్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఇప్పటికే ఆ శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రిపేరేషన్ లో తలమునకలయ్యారు.
ఆర్థికశాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీ కొంతకాలంగా సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆయన బాధ్యతలను తాత్కాలికంగా పీయూష్ కు అప్పగించారు.