- Advertisement -
ఏపీలో టీడీపీ హవా స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈవీఎంల ధ్వంసం కేసులో అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందారెడ్డి చేతిలో 32,324 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మాచర్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన పిన్నెల్లి ఒకసారి కాంగ్రెస్ నుంచి , మూడుసార్లు వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాచర్లలో తిరుగులేని నేతగా ఎదిగిన పిన్నెల్లికి ఓటమి తప్పలేదు.
పోలింగ్ అనంతరం నియోజకవర్గంలో అతడి అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించి పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ పొందారు.
Also Read:వారసులంతా ఓటమే!
- Advertisement -