- Advertisement -
మే 3 వరకు ప్రజలంతా లాక్ డౌన్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు కేరళ సీఎం పినరయి విజయన్. ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తామని..వాహనాల రాకపోకల విషయంలో సరి – బేసి విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.
ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు నాలుగో జోన్ లో ఉంటాయని తెలిపారు.నిబంధనల సడలింపు పాక్షికంగానే ఉంటుందని ..మహిళలు నడిపే వాహనాలకు మాత్రం ఏ రోజైనా అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కరోనా కేసులు అధికంగా ఉన్న కసర్ గోడె, కానూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలు తొలి జోన్ లో ఉంటాయని, ఇక్కడ లాక్ డౌన్ నిబంధనలకు ఎటువంటి మినహాయింపూ ఉండబోదన్నారు.
కేరళలో ఇప్పటివరకు 394 కేసులు నమోదుకాగా 147 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 245 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు.
- Advertisement -