మొటిమలతో ఇబ్బందా.. ఇలా చేయండి!

83
- Advertisement -

మొఖంపై మొటిమలు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా టీనేజ్ లోకి అడుగు పెడుతున్న పిల్లల్లో మొటిమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకాకొందరు యుక్త వయసులో ఉన్నవారికి కూడా మొఖంపై మొటిమలు వస్తుంటాయి. ఇలా మొటిమల కారణంగా అందహీనంగా కనిపిస్తూ ఉంటారు. దాంతో అలాంటి వారు ఎంతో డిగ్రీడ్ గా ఫీలవుతూ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ను కోల్పోతు ఉంటారు. అయితే వయసు రీత్యా మాత్రమే కాకుండా మొఖంపై దుమ్ము ధూళి పేరుకు పోవడం వల్ల కూడా మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో వాటిని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల క్రిములను వాడుతూ ఉంటారు..

ఇలా వాడడం వల్ల మొటిమలు పోకపోగా.. ఇంకా మొఖంపై అదనపు సమస్యలు ఏర్పడాయి. అయితే మొఖంపై మొటిమలను పోగొట్టడానికి సహజ సిద్దమైన పద్దతులు చాలానే ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం మొఖంపై మొటిమలు తగ్గడానికి ఆవిరి పట్టడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఒక గిన్నెలో తగినంతా నీరును పోసి బాగా మరిగించాలి. ఆ తరువాత అందులో యూకలిప్టస్ ఆకులను వేసి పొగలు వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తరువాత తలపై తువ్వాలు కప్పుకొని 10-15 నిముషాల వరకు ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల మొఖంపై ఉండే రంధ్రాలు తెరుచుకొని, మొటిమలలో ఉండే చీము, నూనె మృత కణాలు బయటకు వస్తాయి.

Also Read:Harishrao:సతీష్ బాబును గెలిపించండి

దాంతో త్వరగా మొఖంపై మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఇంకా ఈ పద్దతి మాత్రమే కాకుండా రకరకాల చిట్కాల ద్వారా కూడా మొఖంపై మొటిమలను తగ్గించవచ్చు. ఆలోవెరా, బొప్పాయి, యాపిల్ వంటివి ఫేస్ ప్యాక్ లా చేసుకొని కూడా మొఖంపై 10 నుంచి 15 నిముషాలు ఉంచితే మొటిమలు తగ్గుతాయట. ఆలోవెరా ను సహజంగానే ఫేస్ ప్యాక్ లా ఉపయోగించవచ్చు. ఇక యాపిల్ లో ఉండే ఎన్నో గుణాలు మొఖాన్ని అందంగా మార్చడంలో ఉపయోగ పడతాయి. యాపిల్ జ్యూస్ ను దూదితో ఫేస్ పై రాసి పది నిముషాల తరువాత చల్లనీటితో కడిగేసుకోవాలి. ఇంకా బొప్పాయ్ పండులోనూ గుజ్జు ను బయటకు తీసి దానికి కొద్దిగా శెనగ పిండిని కలుపుకొని ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవడం వల్ల కూడా మొటిమలను గట్టించవచ్చు.

Also Read:బోల్డ్ రోల్స్ కూడా చేస్తా – మీనా

- Advertisement -