నా కొడుకు పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ…..

103
Naa Koduku Pelli Jaragalimalli Malli

సింహ ఫిలింస్‌ పతాకంపై శంకర్‌, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రల్లో గంటా రామకృష్ణ నాయుడు దర్శకత్వంలో అనిల్‌కుమార్‌. జి నిర్మిస్తున్న చిత్రం ‘నా కొడుకు పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ చేతుల మీదుగా ఈ చిత్రం నేడు హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో శంకర్‌, పోసాని కృష్ణమురళీ, ప్రొడ్యూసర్‌ అనిల్‌కుమార్‌, దర్శకుడు గంటా రామకృష్ణ నాయుడు, నటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్‌ ఎస్‌. రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Naa Koduku Pelli Jaragalimalli Malli

ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. రీసెంట్‌గా చేసిన రాజుగారి గది చిత్రంలో వలే..ఈ చిత్రంలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో చేస్తున్నాను. నా తండ్రిగా పోసాని కృష్ణమురళీ గారు అద్భుతమైన పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి నిజమైన హీరో ఆయనే. ఈ చిత్రం ఆద్యంతం కామెడీతో..మంచి ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అలరిస్తుంది..అన్నారు.

పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ..ఇప్పటి వరకు తండ్రిగా ఎన్నో చిత్రాల్లో చేశాను. కానీ ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌. ఒక విభిన్నమైన తండ్రి పాత్రలో కనిపిస్తాను. నా కొడుగ్గా శకలక శంకర్‌ నటిస్తున్నాడు. మా ఇద్దరి కాంబినేషన్‌ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. కంటతడి పెట్టిస్తుంది…అన్నారు.

Naa Koduku Pelli Jaragalimalli Malli

దర్శకుడు గంటా రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్‌గారిక ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది…అన్నారు.

నిర్మాత అనిల్‌కుమార్‌. జి మాట్లాడుతూ..సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినైన నేను ఈ చిత్రం ద్వారా నిర్మాతగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాను. ఈ నెలాఖరు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.