గుండెను పిండేసిన ఫోటో..

250
newborn baby
- Advertisement -

ఒక ఫోటో నెటిజన్ల గుండెలను పిండేసింది. అంతలా గుండెలు పిండేసిన ఫోటో ఏంటని అనుకుంటున్నారా? మీరు చూస్తున్నారే.. అదే ఫోటో. ఒక్క ఫోటో వెయ్యి పదాలతో సమానం అన్న సామెతను ఈ ఫోటో గుర్తుకు తెస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ ఫోటోలో చుట్టూ హార్ట్ సింబల్‌తో కూడిన సిరంజీలు ఉన్నాయి మధ్యలో పసి పాప ఉంది ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది.

newborn baby

ఇక అసలు విషయానికొస్తే..పాట్రిసియా ఓ నీల్, కింబెర్లీ అనే దంపతులకు పెళ్లయి చాలా రోజులు అయినా పిల్లలు లేరు. ఎందుకు లేరు అంటే వాళ్లు ఇద్దరూ మహిళలే. అవును. లెస్బియన్లు వాళ్లు. ఎలాగైనా పిల్లలను కనాలనుకున్నారు. దీంతో వాళ్లు ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. కానీ.. అది బెడిసి కొట్టింది. రెండుసార్లు ఐయూఐ ఫెయిల్ అయింది. దీంతో వాళ్లు ఐవీఎఫ్ పద్ధతిన బిడ్డను కనాలనుకున్నారు. ఐవీఎఫ్ కూడా చాలా సార్లు ఫెయిల్ అయింది. చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇక వద్దులే పిల్లల్ని మనం కనలేం అని వాళ్లు అనుకున్న సమయంలో పాట్రిసియా నెలతప్పింది.

కాని.. లోపల పిండం పరిస్థితి ఏం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. ప్రతి రోజు ఓ గండంలా గడిచింది వాళ్లకు. చివరకు ఆగస్టు 3, 2018 న పాట్రిసియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 4 సంవత్సరాల కల ఇవాళ నెరవేరిందని.. బిడ్డ కోసం వాళ్లు ఉపయోగించిన సిరంజీలన్నింటినీ దాచి.. వాటిని హార్ట్ ఆకారంలో పేర్చి ఆ బిడ్డను మధ్యలో పడుకోబెట్టి ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఏదో సరదాకు చేసిన ప్రయత్నం తమను సోషల్ మీడియాలో ఫేమస్ చేసింది.

- Advertisement -