నేటి రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరిదగ్గర ఉండే కమాన్ వస్తువుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళిన చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఇంట్లో ఉన్న, ఆఫీస్ లో ఉన్న లేదా బయటకు వెళ్ళిన.. ఇలా అన్నీ సమయాల్లో కూడా మొబైల్ చేతిలో ఉండాల్సిందే. అయితే చాలామంది మొబైల్ ను ఫ్యాంట్ జేబులోనూ లేదా షార్ట్ జేబులోనూ పెడుతూ క్యారి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎమౌతుందనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల చాలామంది వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటున్నారు. ఇలా మొబైల్ ను ఫ్యాంట్ జేబులో లేదా చొక్కా జేబులో ఉంచుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ లో ఉండే రీడియేషన్ నేరుగా శరీరంపై ప్రభావంపై చూపే అవకాశం ఉందట. ఫ్యాంట్ జేబులో మొబైల్ ఉంచుకోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. .
మొబైల్ రేడియేషన్ పురుషుల్లో వృషణాల సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందట. తద్వారా పురుషుల్లో శృంగార సమస్యలతో పాటు సంతానోత్పత్తి లోపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చొక్కా జేబులో కూడా మొబైల్ ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మొబైల్ రేడియేషన్ గుండె జబ్బులు పెరగడానికి కారణం అవుతుంది. ఇంకా మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. తీవ్ర తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు మానసిక ఆందోళన, డిప్రెషన్.. వంటివాటికి దారి తీసే అవకాశం ఉందట. అందువల్ల మొబైల్ ను ఫ్యాంట్ జేబులో గాని లేదా షార్ట్ జేబులో గాని పెట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి మొబైల్ కోసం సపరేట్ గా మొబైల్ బ్యాగ్ లను క్యారి చేయడం మంచిది. వీలైనంత వరకు మొబైల్ కు దూరం పాటించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read:Rohith Sharma: చివరి టెస్టుకు రోహిత్ దూరం?