ముచ్చెర్లలో అతిపెద్ద పార్మా క్లస్టర్‌: కేటీఆర్

466
ktr
- Advertisement -

మంగళ్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్‌ పార్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన కేటీఆర్…హైదరాబాద్ నగరం మహానగరంగా విస్తరిస్తుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రభాగాన ఉందన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి లాజిస్టిక్ పార్కు ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైందన్నారు. త్వరలో బాటసింగారంలో మరో లాజిస్టిక్ పార్కు ప్రారంభంకానుందన్నారు.

ఆదిబట్లలో ఇప్పటికే టీసీఎస్ కంపెనీ రాగా త్వరలో మరిన్ని కంపెనీలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు కేటీఆర్. ప్రజల కోసమే తప్ప ఏనాడూ సొంతపనికోసం సిఫారసు చేయలేదన్నారు. కిషన్ రెడ్డి కోరిన విధంగా ఇబ్రహీంపట్నంలో నాలుగు మున్సిపాలిటీలకు రూ. 40 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

INAUGURATE LOGISTIC PARK (1)

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ముచ్చెర్లలో రాబోతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అభివృద్ధి నిరోదకులు ఎప్పుడూ ఉంటారని వారిని పట్టించుకోవద్దన్నారు. కాలుష్యం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుచేస్తామన్నారు. ఔటర్‌ రింగ్ రోడ్డుతో నలువైపులా పరిశ్రమలను స్ధాపించుకునే అవకాశం కలిగిందన్నారు.

- Advertisement -