వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్‌!

307
corona vaccine
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది ఫైజర్‌ సంస్థ.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క‌రోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డానికి అమెరికా డ్ర‌గ్ మేక‌ర్ ఫైజ‌ర్ క‌స‌ర‌త్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డోస్ వ‌చ్చే నెల‌లోనే అందుబాటులోకి రానుంద‌ని ఫైజ‌ర్ సంస్థ వెల్ల‌డించింది.

ఎమ‌ర్జెన్సీ వ్యాక్సినేష‌న్‌కు అనుమతించాలని ఫైజర్ సంస్థ ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరగా అనుమ‌తించేందుకు త‌గిన ఆధారాలు ఉన్నాయో లేదో అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌రిశీలించ‌నుంది. ఒక‌వేళ ఎఫ్‌డీఏ ఓకే అంటే.. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా మొద‌ల‌వుతుంది.ఈ సంస్థ చేస్తున్న మూడోదశ క్లీనికల్ ట్రయల్స్‌ సమర్థవంతమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి. కోవిడ్ రోగులపై 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ఫైజర్ ప్రకటించింది.

- Advertisement -