స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర..

543
- Advertisement -

పెట్రోల్ ధర మళ్లీ స్వల్పంగా తగ్గింది. 10 పైసలు దిగొచ్చింది. ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి.పెట్రోల్ ధర తగ్గితే డీజిల్ ధర మాత్రం అదేరీతిలో ఉంది. దీంతో ఈ రోజు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 79.04కు తగ్గింది. డీజిల్ ధర మాత్రం రూ.73.44 వద్ద స్థిరంగా ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్‌ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.78.62కు క్షీణించింది. డీజిల్‌ ధర కూడా 8 పైసలు క్షీణతతో రూ.72.68కు తగ్గింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.78.25కు క్షీణించింది. డీజిల్ ధర 8 పైసలు క్షీణతతో రూ.72.34కు తగ్గింది.

Petrol Rate Today

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్‌ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.74.33కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 8 పైసలు క్షీణతతో రూ.67.35కు తగ్గింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.79.93కు క్షీణించింది. డీజిల్ ధర 8 పైసలు క్షీణతతో రూ.70.61కు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇలా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.16 శాతం పెరుగుదలతో 57.80 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.23 శాతం పెరుగుదలతో 52.57కి పెరిగింది.

- Advertisement -