- Advertisement -
పెట్రోబాంబ్ ఆగడం లేదు. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ కూడా పెట్రోల్,డీజీల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు. పెట్రోల్ పై 90, డీజిల్ పై 87 పైసలు చొప్పున పెంచగా ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40 కు చేరగా.. డీజిల్ ధర 101.56 కు చేరింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల అనంతరం సామాన్యులకు పెట్రో షాక్ తప్పడం లేదు.
- Advertisement -