- Advertisement -
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 41 పైసలు, డీజిల్‌పై 42 పైసలు పెరుగగా హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.114.13, డీజిల్ 107.40కి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.69, డీజిల్ లీటర్‌కు రూ.98.42, ముంబైలో పెట్రోల్ రూ.115.50, డీజిల్ రూ.106.62కు పెరిగింది.
2020-21లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం రూపంలో ప్రభుత్వం మొత్తం 3.89 లక్షల కోట్లు ఆర్జించింది. 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు, 2018-19లో రూ.2.3 లక్షల కోట్లు. పెట్రోలియం ఉత్పత్తులపై పెరిగిన ఎక్సైజ్ సుంకం కారణంగా 2020-21 ప్రథమార్థంలో రూ.42,931 కోట్ల ఆదాయం సమకూరిందని సీజీఏ డేటా తెలిపింది.
- Advertisement -