పెట్రోల్,డీజీల్ మరింత పైపైకే..

134
Petrol
- Advertisement -

వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఇవాళ పలు రాష్ట్రాల్లో చమురు ధరలు స్థిరంగా ఉండగా దేశ రాజధాని ఢిల్లలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ లీటర్ ధర 13 పైసలు పెరిగింది.

ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66,డీజిల్ ధర రూ. 87.41గా ఉండగా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82, డీజిల్ ధర రూ.94.84గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.89 పలకగా.. డీజిల్ ధర రూ.92.66గా ఉంది.

ఇప్పటివరకూ జూన్ నెలలో ఇందన ధరలు తొమ్మిది సార్లు, మే నెలలో 16 సార్లు పెరిగాయి.మే 4 నుంచి ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.100 మార్క్ దాటేశాయి.

- Advertisement -