ట్విట్టర్‌కు హైదరాబాద్ పోలీసుల షాక్

262
twitter
- Advertisement -

కొత్త ఐటీ రూల్స్ తెచ్చిన దగ్గరి నుండి ట్విట్టర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కేంద్రం నోటీసులు ఇవ్వగా, తాజాగా హైదరాబాద్‌ పోలీసులు ట్విటర్‌కు నోటీసులు జారీ చేశారు. తప్పుడు వీడియో సర్క్యూలేట్ చేసినందుకు నోటీసులు జారీ చేశారు.

జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ట్విట్టర్‌పై కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించిన పోలీసులు…త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని నోటీసులు కూడా జారీ చేశారు.

కొత్త ఐటీ నిబంధనలను పాటించాల్సిందేనని ఇప్పటికే అన్ని సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటీసులు ఇవ్వగా పలు సంస్థలు స్పందించి భారత ఐటీ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపాయి.

- Advertisement -