స్థిరంగా పెట్రోల్ ధరలు..

70

గత రెండు రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర 105 నుంచి 108 రూపాయల మధ్యలో ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే 95 నుంచి 99 మధ్య ఉంది. జిల్లాల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాలో రూ.107 రూపాయాలు దాటింది. ఇక మిగతా జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105 రూపాయలుకు పైనే ఉంది.

ఇక ఏపీ విషయానికి వస్తే, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ. 107 దాటింది. మిగిలిన జిల్లాలో రూ.105 నుంచి 106 మధ్యలో ఉంది. ఇక డీజిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. రూ.95 నుంచి రూ.100 మధ్య డీజిల్ ధరలు ఉన్నాయి.