- Advertisement -
పెట్రో ధరల పెంపు ఆగడం లేదఉ. గత 12 రోజుల్లో పెట్రోల్,డీజీల్ ధరలు పెరగడం ఇది పదకొండోసారి. 11 రోజుల్లో లీటరుపై సుమారు రూ.9 వరకు చమురు ధరలు పెరిగాయి. ఇవాళ లీటరు పెట్రోల్‌పై 92 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 117.25కు చేరగా, డీజిల్ ధర రూ.103.32కు పెరిగింది.
ఢిల్లీలో లీటరుపై 80 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ ధర రూ.103.41, డీజిల్ రూ.94.67కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.118.41 (84 పైసలు), డీజిల్ రూ.102.64గా (85 పైసలు), చెన్నైలోలో 75 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.108.96, డీజిల్ ధర రూ.108.96గా ఉంది.
- Advertisement -