బగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్‌ ధ‌ర‌లు..

278
Petrol Price
- Advertisement -

దేశంలో చ‌మురు ధ‌ర‌లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై 34 పైస‌ల చొప్పున పెంచుతున్న‌ట్లు చ‌మురు కంపెనీలు ప్ర‌క‌టించాయి. హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.92.26కు చేరగా, డీజిల్ ధ‌ర రూ.86.23గా ఉంది.

అలాగే, వ‌రంగ‌ల్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.71, డీజిల్ ధ‌ర రూ.85.64కి పెరిగింది. ఢిల్లీలో లీట‌రు పెట్రోలుపై 29 పైస‌లు, డీజిల్‌పై 32 పైస‌లు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధ‌ర రూ.88.73, డీజిల్ ధ‌ర రూ. 79.06కి చేరింది. ముంబైలో లీట‌రు పెట్రోలు రూ.95.21గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర 86.04గా ఉంది.

- Advertisement -