రోజురోజుకి పెరుగుతున్న పెట్రో ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ తర్వాత వరుసగా తొమ్మిదో రోజూ పెట్రో, డీజిల్ ధరలను పెంచాయి.హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర 50 పైసలు పెరుగుదలతో రూ.79.17కు, డీజిల్ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.72.93కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.3 శాతం తగ్గుదలతో 37.84 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 3.12 శాతం క్షీణతతో 35.12 డాలర్లకు దిగొచ్చింది. అయితే మార్చి నెలలో కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం విధించడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి చమురు కంపెనీలు పెట్రో ధరలను గత తొమ్మిదిరోజులుగా ప్రతి రోజూ పెంచుతూ వస్తున్నాయి.