- Advertisement -
బుధవారం స్థిరంగా ఉన్న దేశీ ఇంధన ధరలు గురువారం (జనవరి 31) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర 1 పైసా తగ్గితే.. డీజిల్ ధర 8 పైసలు దిగివచ్చింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. పెట్రోల్, ఢీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.94 ఉండగా, లీటర్ డీజిల్పై ధర రూ.65.81గా ఉంది. నిన్న పెట్రోల్ ధర రూ. 71.09గా ఉండగా, డీజిల్ ధర రూ.65.81గా ఉంది. 45 రోజుల క్రితం రూ.90 వరకు చేరుకున్న డీజీల్, పెట్రోల్ ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంది.
ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 75 మార్క్ పైనే కదలాడుతోంది. రూ.75.42 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.71.54 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ రూ.75.19 వద్ద, డీజిల్ రూ.70.93 వద్ద ఉన్నాయి.
- Advertisement -