రోజురోజుకు పెట్రోల్ ధరలు ఆకాశానంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా ఆ బాటలోనే పలు రాష్ట్రాలు పయనించాయి. అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి..
అసోం పెట్రోల్, డీజిల్‌పై రూ. 7 చొప్పున తగ్గించగా.. త్రిపుర కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గోవా ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై రూ.7చొప్పున వ్యాట్‌ను కుదించింది. బీహార్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున తగ్గించగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్‌ను తగ్గించింది.. డీజిల్‌పై మాత్రం వ్యాట్ తగ్గించలేదు.
మణిపూర్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గించగా బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కూడా పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున తగ్గించింది. ఒడిశా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.3మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.