మరింత పైపైకి పెట్రో ధరలు!

179
petrol
- Advertisement -

దేశంలో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారులు షాక్‌కు గురవుతుండగా తాజాగా ఇవాళ కూడా పెట్రోల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు.

ఇవాళ 27 పైసలు పెట్రోల్‌పై పెరుగగా ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.30, డీజిల్ ధర రూ.76.48గా ఉంది. దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో పెట్రోల్‌ ధర రూ. 93.60గా ఉండగా డీజిల్‌ రూ.85.67గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర గత 20 రోజులలో స్థిరంగా ఉన్నప్పటికీ, దేశీయ చమురు సంస్థలు మాత్రం వడ్డింపు ఆపడంలేదు. క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌ 55 నుంచి 56 డాలర్లుగా ఉంది.

- Advertisement -