వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి..

333
Petrol Attack
- Advertisement -

వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రవళి అనే యువతి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఆమె స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం. ఈరోజు కాలేజీకి వెళ్తున్న సమయంలో సాయి అన్వేష్‌ అనే యువకుడు ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Petrol Attack

ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా దాడికి పాల్పడ్డ అన్వేష్‌ కూడా వాగ్దేవి కాలేజీలోనే చదువుతున్నాడు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన అతడికి దేహశుద్ధి చేసిన తోటి విద్యార్థులు పోలీసులకు అప్పగించారు.  ప్రేమ విషయంలో వీరి ఇద్దరి మధ్య గొడవ నడుస్తున్నట్టు చెబుతున్నారు. ప్రేమించాల్సిందిగా రవళి వెంట అవినాష్ పడుతున్నాడు. ఈ విషయంలోనే కక్ష పెంచుకున్న అవినాష్ ఇలా దాడి చేసినట్టు చెబుతున్నారు. పెట్రోల్ పోసి అంటించడంతో రవళి శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గతంలోనూ ఒకసారి వరంగల్‌లో ఇలాగే విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది. ఆసమయంలో యాసిడ్ దాడి చేసిన యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసేశారు.

- Advertisement -