లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక.. కాంగ్రెస్‌లో కుమ్ములాట..

238
Telangana Congress
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వాడివేడి చర్చ జరిగింది. టీ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో మంగళవారం గాంధీభవన్‌లో ఈ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా, ఉత్తమ్‌, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్దులుగా తెలంగాణ కాంగ్రెస్‌ నుండి సీనియర్లు,ముఖ్య నేతలు కాకుండా.. కొత్తగా కొందరు పారిశ్రామికవేత్తల పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది. దాంతో నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మటల యుద్ధం జరిగింది. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చింది.

జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు ఇచ్చిన లోక్‌సభ అభ్యర్థుల పేర్లపై ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో పార్లమెంటు స్థానానికి ఇద్దరి నుంచి ఐదుగురి పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా సిద్ధం చేసింది. ఈ జాబితాతో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిల్లీ వెళ్లి ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి జాబితా అందచేస్తారు. పరిశీలన అనంతరం ఏఐసీసీ అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

Telangana Congress

ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. జిల్లాకు చెందిన ముఖ్యనాయకురాలు మాజీ ఎమ్మెల్యేలు డీకె అరుణ – చిన్నారెడ్డి – సంపత్ – వంశీల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని డీకే అరుణను ఏఐసీసీ నేత కుంతియా అడుగగా..తాను పోటీ చేయలేనని ఇదివరకే ఆర్థికంగా నష్టపోయానని.. తన బదులు జైపాల్ రెడ్డితో పోటీ చేయించాలని పేర్కొంది. కానీ కాంగ్రెస్ నేతలు సుముఖంగా లేరు. మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేయడం కుదరదని స్ఫష్టం చేశారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్.

దీంతో ఉత్తమ్ పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్ద నాయకులే అండగా ఉండాలని డీకే అరుణ ఘాటుగా స్పందించ్చారు. అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ సీటుపై డీకే అరుణ – సంపత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం ఎంపీ నంది ఎల్లయ్యకు డీకే అరుణ మద్దతు పలికారు. నంది ఎల్లయ్యకు టికెట్ ఇవ్వకపోతే సతీష్మాదిగ పేరు పరిశీలించాలని కోరారు. ఈ ప్రతిపాదనపై మాజీ ఎమ్మెల్యే సంపత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Telangana Congress

పార్టీలోని సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి గానీ.. కొత్తగా వచ్చిన వారికి ఎంపీ స్థాయి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అసెంబ్లీ టికెట్లు – ఏఐసీసీ పదవులు ఇచ్చినప్పుడు ఎంపీ సీటును ఇవ్వడంలో ఎందుకు అభ్యంతరమని డీకే అరుణ కౌంటర్ ఇచ్చారట. డీకే అరుణ పీసీసీలో సభ్యురాలు కాబట్టి ఆమె ఎవరినైనా సూచించవచ్చన్నారు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ఈ వ్యవహారంపై కుంతియా క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికి పార్లమెంట్ టికెట్ పై జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుల్లోని బేధాభ్రియాపాలు మరోసారి బయటపడ్డాయి.

- Advertisement -