తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై అక్టోబర్ 31లోపు నిర్ణయం తీసుకోవాలని జూలై 31న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంతో పిటిషన్ దాఖలు కాగా వచ్చే సోమవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టును మరో 8 వారలు గడువు కోరారు స్పీకర్. సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువులో కేవలం నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మాత్రమే విచారించారు స్పీకర్. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారలు గడువు కోరారు.
Also Read:‘ప్రేమంటే’ …’పెళ్లి షురూ’

