ఓటమి భయంతోనే..రేవంత్ రివ్యూ మీటింగ్‌లు!

12
- Advertisement -

జూబ్లిహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ చీరలు, కుక్కర్లు,డబ్బులు పంచుతున్నారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై బీఆర్‌కే భవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి, ఫిర్యాదు చేశారు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సీఈవో సుదర్శన్ రెడ్డిని కోరారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు… సీ విజిల్ యాప్ లో కంప్లైంట్ చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. సెన్సిటివ్ బూతులు ఉన్నాయి,, అక్కడ సెంట్రల్ బలగాలు పెట్టాలి…. ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తరవాత లోపలికి అనుమతించాలి అన్నారు. బయటనే వారిని ఆధార్ కార్డుతో వెరిఫై చేసి పంపాలి అన్నారు.

అన్ని ఆధారాలు ఎలక్షన్ కమిషన్ కు పంపించాం… ఫేక్ ఐడి కార్డులు కుప్పలుకుప్పలు గా బయటికి వస్తున్నాయి..వాటిని గుర్తించలేదు..ఎన్నికల అధికారులు వాటినీ ఎందుకు కట్టడి చేయలేదు చెప్పాలన్నారు. అబ్జర్వర్ లు ఉన్న పట్టించుకోవడం లేదు..యూసఫ్ గూడ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పక్కనే పోలింగ్ బూత్ ఉంది ఎలా అక్కడ అనుమతి ఇచ్చారు…రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు గ్యారంటిల మీద రివ్యూ చేస్తున్నడు అన్నారు.

రెండేళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు…రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి,ఓడిపోతున్నామనే భయంతో ఆదరాబాదరాగా రివ్యూలు చేస్తున్నారు…ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలి..స్వయంగా ఎన్నికల అధికారులు అక్కడ పరిస్తితి పర్యవేక్షిస్తామని చెప్పారు.

Also Read:‘ప్రేమంటే’ …’పెళ్లి షురూ’

- Advertisement -