తిరుగులేని టీఆర్ఎస్‌.. కేసీఆర్‌కే ప్రజల మద్దతు

212
People trust TRS
- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్‌ తిరుగులేని రాజకీయశక్తిగా రూపాంతరం చెందుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ నాయకత్వం వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి.

ఆజ్‌తక్- ఇండియాటుడే మీడియా గ్రూపు, వీడీపీ అసోసియేట్స్‌లు వేర్వేరుగా నిర్వహించిన పోల్స్‌లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం గులాబీ వికసిస్తుందని తెలిపాయి. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించబోతున్నదని కుండబద్దలు కొట్టాయి.

Image result for people for trs

ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌కు మద్దతుగా 43 శాతం ఓటర్లు నిలవగా వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో 51% ఓటేశారు. టీఆర్ఎస్‌కు 80 సీట్లు వస్తాయని తెలిపింది. టీఆర్‌ఎస్ సర్కారు పనితీరుపై 64% ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారని ఆజ్‌తక్ సర్వే తెలిపింది.

ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 18%, బీజేపీ నేత కిషన్‌రెడ్డికి 15%, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 4% మద్దతు ఉందని ఆజ్‌తక్ సర్వేలో వెల్లడైంది. ఇక ఏపీలో వైఎస్ జగన్‌కు రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుందని తెలిపింది. 43% ప్రజాదరణతో జగన్ ముందంజలో ఉన్నారని తెలిపారు.

- Advertisement -