బీజేపీ ఎంపీకి ఘోర అవమానం….!

79
bjp mp
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. గత ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ అసమర్థ పాలనపై యుపీ ప్రజలు ఆగ్రహంతో రగలిపోతున్నరు. రామమందిరం నిర్మాణం పేరుతో హిందూత్వ సెంటిమెంట్‌ను రగిలించి ఎన్నికల్లో గెలిచేందుకు కాషాయ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కాగా యోగి సర్కార్‌ అసమర్థ పాలనపై రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఐదేళ్లుగా యోగి పాలనలో బీజేపీ అధ్వాన్న స్థితికి చేరుకుంది. కనీసం ప్రజలకు తాగునీరు అందించడంలో కూడా బీజేపీ ప్రభుత్వం విఫలమైంది.

ఇక రైతు ఉద్యమంలో అన్నదాతల పట్ల మోదీ సర్కార్ అనుసరించిన నిరంకుశ వైఖరిపై యుపీ ప్రజలు రగిలిపోతున్నరు. లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి నలుగురు రైతులను కారుతో తొక్కించి చంపడంతో యుపీ గ్రామాల్లో బీజేపీపై నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం తమ గ్రామాల్లో అడుగుపెట్టిన బీజేపీ నేతలపై రాళ్లు, కర్రలతో దాడులు చేస్తూ తరిమికొడుతున్నరు. యుపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌తో సహా, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పలువురు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహానికి తోకముడిచి ఎన్నికల ప్రచారం చేయకుండా వెనుదిరగాల్సి వచ్చింది.. ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో అధికార బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. తమకు తొలి మూడు విడతల్లో దాదాపు 180 నుంచి 200 సీట్లు వస్తాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాగా ఆర్ఎల్డీ కూడా సత్తాచాటుతోంది.

కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం కిందామీదాపడుతోంది..ఎస్సీ దెబ్బకు బీజేపీ వెనుకబడిపోవడంతో కాషాయపెద్దల్లో కలవరం మొదలైంది. అందుకే మోదీ, అమిత్‌షాలతో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ సీఎంలు, ఇతర అగ్ర నేతలను కూడా యుపీలో ప్రచార బరిలోకి దింపింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్ తీవారిని ప్రజలు ఉరికించి తరిమికొట్టారు. బీజేపీ ముర్దాబాద్, గోబ్యాక్ అంటూ మనోజ్ తివారిపై ప్రజలు తిరగబడ్డారు. ప్రజల ఆగ్రహానికి భయపడిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారి కాన్వాయ్‌ను వదిలేసి ఏకంగా పోలీసుల బైక్ మీద అక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది. మొత్తంగా యుపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీని ప్రజలు తరిమికొట్టిన ఘటన రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓటమికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. ప్రస్తుతం ప్రజల తిరుగుబాటుతో బీజేపీ ఎంపీ మనోజ్ తివారి బైక్‌పై పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -