కారు..జోరు.. టీఆర్‌ఎస్‌కే మా ఓటు

263
trs people
- Advertisement -

తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా ,తెలంగాణను తెచ్చిగా టీఆర్ఎస్‌ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

trs people

మళ్లీ తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారే ముఖ్యమంత్రి కావాలని, మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీనే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు గుండెలనిండా కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే తామంతా టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటేస్తామని ప్రతిజ్ఞతలు చేస్తున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు మంగళహారతలు, డప్పు చప్పుళ్లతో ఘనంగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదని, అధికారంలో ఉన్నన్నాళ్లు ఏనాడు తమ బాగోగులు పట్టని పార్టీలు మరోసారి తమను వంచించడానికి వస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

trs people

స్వరాష్ట్రంలో, స్వపరిపాలనలో తమ బతుకులు మారాయని, సీఎం కేసీఆర్‌ ఈ నాలుగేళ్ల పాలనలో తమ జీవితాల్లో వెలుగులు నింపారని, తెలంగాణ ప్రభుత్వం వల్ల తమ కుటుంబాలు లబ్ధిపొందాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ తామంతా మరోసారి సీఎం కేసీఆర్‌కే ఓటేస్తామని, తిరిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపాస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ ఎళ్లవేలలా తమ అభివృద్ధికి కృషి చేస్తూ తమ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారని అంటువంటి నేతలను మళ్లీ తిరిగి గెలిపిస్తామని నిండు మనసుతో చెబుతున్నారు.

- Advertisement -