జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాస్త సేదదీరారు.రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు..
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత రుచిని ఆస్వాదిస్తూ ఆమె వివరాలు సేకరించారు..తన పేరు కొమురమ్మ అని పేర్కొంటూ నాటికి నేటి కేసీఆర్ సారు పాలనకు తేడాను వివరించింది కొమురమ్మ…తనకే కాదు ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని కొమురమ్మ పేర్కొంది.
Also Read:మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు:తలసాని
స్వయంగా కేసీఆర్ బాపు కూతురే తన వద్ద మొక్కజొన్న తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఇక ఎమ్మెల్సీ కవితను చూసిన స్దానిక వాహనదారులు సెల్ఫీలు,ఫోటోలు దిగుతూ అభిమానాన్ని చాటుకోగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కూతురిగా ఉన్నా సాదాసీదాగా వ్యవహరించిందని ఈ సందర్బంగా పలువురు వాహనదారులు చర్చించుకుకోవటం విశేషం.
Also Read:Harishrao:హ్యాట్రిక్ కొడతాం