ఇప్పుడే ఇలా.. అధికారమిస్తే అరాచకమే!

59
- Advertisement -

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయట పడుతోంది. ఓటర్లకు గాలం వేసేందుకు ఆరు గ్యారెంటీలు ఆరు హామీలు అంటూ అమలు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న హస్తం పార్టీ వంకర బుద్ది బయట పడుతోంది. దోపిడికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ పార్టీకి దోచుకోవడం తప్పా అభివృద్ధి చేయడం సంక్షేమ పథకాలు చేయడం తెలియదని ఆ పార్టీ నేతలే నిరూపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ తెలంగాణ ఆదర్శ ప్రాయంగా ఉంది. 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, దళిత బంధు వంటి ఎన్నో పథకాలు తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి. .

అయితే ప్రస్తుతం అమలవుతున్న పథకాలను తాము అధికారంలోకి వస్తే తీసేస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు, ధరణి రద్దు చేస్తామని, రైతు బంధు ఆపేస్తామని.. ముందే ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే హస్తం నేతల పాలన విధానం ఎలా ఉండబోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక కరెంటు విషయానికొస్తే రైతులకు మూడు గంటలే కరెంట్ చాలని చెబుతూ ఆల్రెడీ అమలౌతున్న 24 కరెంట్ తీసేస్తామని పరోక్షంగా హింట్ ఇస్తున్నారు. ఇలా ప్రజలకు ఉపయోగక కరంగా, ప్రయోజనకరంగా ఉండే వాటిపై హస్తం నేతలు ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే దానికి అసలు కారణం.. ఆ పార్టీలోని నేతలకు పాలన విధానం తెలియకపోవడమే అనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

కే‌సి‌ఆర్ తన విజన్ తో అసాధ్యం అనుకున్న 24 గంటల ఉచిత కరెంట్ ను సాధ్యం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ స్థాయి పాలన దక్షత ఉన్న నేత కాంగ్రెస్ లో లేకపోవడం వల్ల.. ఆ పార్టీ చేతగానితనం స్పష్టంగా బయటపడుతోంది. ఇకపోతే రైతులకు సాగు నిమిత్తం అందే రైతుబందును రద్దు కావడంలో కాంగ్రెస్ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిన విషయం. అధికారంలోకి రాకుండానే రైతుబంధు పథకానికి బ్రేక్ వేసి రియాతుల నోళ్లలో మట్టి కొట్టిన కాంగ్రెస్.. ఇక అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు, పట్వారీల వ్యవస్థ, దళారులు రాజ్యమేలడం.. వంటి విపత్కర పరిస్థితులను మళ్ళీ చూడాల్సివస్తుందో అనే భయం చాలా మందిలో కనిపిస్తోంది. ఎన్నికల ముందే ప్రజాభివృద్దికి గండి కొడుతున్న కాంగ్రెస్.. అదికారంలోకి వస్తే అరాచకానికి ఆహ్వానం పలికినట్లేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read:Congress:ఆ రాష్ట్రాల్లో కూడా డౌటే?

- Advertisement -