కే‌సి‌ఆరే కావాలి.. రావాలి!

31
- Advertisement -

తెలంగాణలో మరో 25 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి. దాంతో ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. కాగా ఇప్పటివరకు వచ్చిన సర్వేలు, విశ్లేషణలు, అన్నీ కూడా మళ్ళీ బి‌ఆర్‌ఎస్ కే పట్టంకట్టాయి. తెలంగాణ ప్రజలు సి‌ఎంగా కే‌సి‌ఆర్ నే కోరుకున్నట్లు తేల్చి చెప్పాయి. ఇటీవల జీ న్యూస్ మ్యాట్రిజ్ ఒపీనియన్ సంస్థ నిర్వహించిన సర్వేలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ 70-76 సీట్లు కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ కు 27 నుంచి 30 సీట్లు, బీజేపీ 5-8 సీట్లు మాత్రమే వస్తామని ఆ సర్వే వెల్లడించింది. .

కాగా గతంలో బయటకు వచ్చిన పలు నేషనల్ సంస్థల సర్వేలు కూడా బి‌ఆర్‌ఎస్ కు 70 నుంచి 80 స్థానాలు సొంతం చేసుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పిన సంగతి విధితమే. ప్రస్తుతం రాష్ట్రం మూడో వంతు భాగం ప్రజలు కే‌సి‌ఆర్ పాలనపై అత్యంత సంతృప్తికరంగా ఉనట్లు నివేధికలు చెబుయితున్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం అభివృద్ధి సమపాళ్ళలో అందిస్తూ పాలన సాగిస్తున్నముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ మళ్ళీ రావాలని ప్రజలు పూర్తి మద్దతుతో కోరుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నది పై పై హడావిడే తప్పా.. ప్రజల్లో ఆ పార్టీలపై ఎలాంటి అభిప్రాయం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో 100 స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని అధినేత కే‌సి‌ఆర్ మొదటి నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రజానాడీని అంచనా వేయడంలో కే‌సి‌ఆర్ ఏ స్థాయిలో సిద్దహస్తుడో అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి అటు సర్వేలు, ఇటు విశ్లేషణలు, అలాగే ప్రజా మద్దతు.. ఇలా అన్నీ రాబోయే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ విజయాన్ని ప్రతిబింభిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:యాంకర్ బ్యూటీలు బిల్డప్ కామెంట్లు

- Advertisement -