సేంద్రియ ఉత్పత్తుల వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి

249
organic

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమూకులలో సేంద్రియ రైతు ఉత్పత్తుల విక్రయ వెబ్ సైట్ ను ప్రారంభించారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మంచి ధరతో మార్కెటింగ్ సౌకర్యం కోసం ఈ వెబ్ సైట్ ప్రారంభించాం. క్యాన్సర్‌వంటి వ్యాధులు‌ పెరుగుతుండటానికి కారణం మనం తీసుకునే కలుషిత ఆహారం నీరు, గాలి కారణమని చెప్పారు. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు‌ పండించడం వల్ల ‌క్యాన్సర్ కేసులు ‌ఎక్కువవుతున్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై మక్కువ ‌ఏర్పడిందన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల‌ గ్రామంలో‌జరిగిన సేంద్రీయ, వ్యవసాయ రైతుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ వెబ్ సైట్‌లో సేంద్రీయ వ్యవసాయం ‌చేసే రైతు వివరాలు, పొలం, ఫోటోలు, పంట‌వివరాలు, ఫోన్ నెంబరు వంటివి ఉంటాయన్నారు. సేంద్రీయ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల‌ నుంచే నేరుగా కొనుగోలు చేయవచ్చన్నారు. సేంద్రీయ రైతులకు మంచి ధర వచ్చేందుకు, కొనుగోలు దారులకు నిజమైన సేంద్రీయ ‌ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.