గ్రామ సభ..అధికారులను నిలదీస్తున్న ప్రజలు

2
- Advertisement -

గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. పెద్దపల్లి నియోజకవర్గం బోంపల్లి గ్రామ సభలో అధికారులపై తిరగబడ్డారు గ్రామస్తులు. గుంట భూమి లేని వారి పేరు లిస్టులో లేవు కానీ ఎకరాలకేకరాలు ఉన్న వారి పేర్లు లిస్టులో ఉన్నాయంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రేషన్ కార్డుల కోసం ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులను నిలదీశారు ప్రజలు. గ్రామస్తులను సముదాయించిన అధికారులు.. వెనక్కి తగ్గలేదు గ్రామస్తులు. పోలీస్ బందోబస్తు మధ్య గ్రామ సభలు కొనసాగుతున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గ్రామసభలలో గందరగోళం నెలకొంది. బోధన్ మండలం కల్దుర్కి, పెగడపల్లి, ఏరాజ్పల్లి, పెంటఖుర్ద్, హాంగర్గ, జాడిజమాల్ పూర్, సాలంపాడ్, మినార్ పల్లి గ్రామ సభలో పాల్గొన్న ప్రజలు, అధికారుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Also Read:Kumbh Mela:9 కోట్ల మంది పుణ్యస్నానాలు..

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులకే పెద్దపీట వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ఆత్మీయ భరోసాలో అనేకమంది పేర్లు గల్లంతు కావడంతోమండిపడుతున్నారు ప్రజలు. రేషన్ కార్డ్ ఎంపిక ప్రక్రియలో అర్హులకు అన్యాయం జరుగుతుందంటూ అధికారుల నిలదీశారు ప్రజలు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని గ్రామసభలో రసాభాస నెలకొంది. భూమి ఉన్న వారికి భూమి లేదని లిస్టులో పేర్లు, ఇల్లు ఉండి ఇల్లు లేవని లిస్టులో పేర్లు ఉండటంపై అధికారుల పై మండిపడ్డారు గ్రామస్థులు.

- Advertisement -