బీజేపీని గద్దె దించడం ఖాయం:రేవంత్

12
- Advertisement -

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని…ఎన్నికలు వస్తే చాలు మోడీకి పాకిస్థాన్ గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరూ వెళ్లరు. మోడీ ఇష్టం మేరకు వెళ్లి పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారన్నారు. పదేళ్ల దేశ పురోగతి ప్రోగ్రస్ కార్డు బీజేపీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ గ్యారెంటీ వారంటీ ఖతమైందన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రజల తరఫున సోనియా గాంధీని ఆహ్వానించామని…రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని చెప్పారు.సోనియా రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

Also Read:KTR:రైతులపై లాఠీఛార్జ్..సిగ్గుచేటు?

- Advertisement -