పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ ఇకలేరు..

265
Pejawar Seer Vishwesha Teertha Swami
- Advertisement -

పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీ(88) కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరతీర్థ డిసెంబర్‌ 20వ తేదీన బెంగళూరులోని కేఎంసీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో పరిస్థితి పూర్తిగా విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

దీంతో మఠంలోనే తుది శ్వాస విడవాలన్న ఆయన చివరి కోరిక ప్రకారం లైఫ్‌ సపోర్ట్‌తో స్వామిజీని ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు తరలించారు. మఠంలోనే ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి యొడియూరప్ప,భారత ప్రధాని మోదీ పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి మృతి పట్ల సతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -