‘సరిలేరు నీకెవ్వరు’.. తమన్నా స్పెషల్ సాంగ్‌..

358
Tamannaah
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ గా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.

ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా సందడి చేయనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ జోరుగా సాగుతుండగా, తాజాగా ‘డాంగ్ డాంగ్…’ అంటూ సాగే తమన్నా స్పెషల్ సాంగ్ టీజర్ విడుదలై కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లోకి ఈ టీజర్ వెళ్లగా, గంటల వ్యవధిలో 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘హలో… ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై. తూ ఆజానా…’ అంటూ సాగే ఈ పాట టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండీ..!

- Advertisement -