కమీషన్లు తప్ప పాలనపై దృష్టి ఏది?

15
- Advertisement -

కాంగ్రెసోళ్లకు పర్సెంటేజీలు, పంపకాల మీద ఉన్న శ్రద్ధ.. పాలన, ప్రజల మీద శ్రద్ధ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి ఆయన నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యలు సృష్టించి దోపిడీలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని..కాంగ్రెస్‌ పాలనలో హత్యలు, నేరాలు పెరిగిపోయాయని విమర్శించారు. హామీలపై నిలదీస్తే అధికార పార్టీ నేతలు పోలీసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన కుటుంబంపై దాడి ఘటనతో పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతున్నదని చెప్పారు.

ప్రశ్నిస్తే థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు పైసా నిధులు తేలేదని విమర్శించారు.

Also Read:బిడ్డను కంటే రూ.92 వేలు..ఎక్కడో తెలుసా?

- Advertisement -