అధికారం చేతిలో ఉందని బీఆర్ఎస్ వరంగల్ సభను అడుగడుగునా అడ్డుకున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన పెద్ది.. ఆర్టీవోలు బీఆర్‌ఎస్ సభను అడ్డుకున్నారు అన్నారు. ఎన్నడూ డ్యూటీకి వెళ్లని ఆర్టీవోలు నిన్న రోడ్ల మీద చెక్‌పోస్టులు పెట్టారు అన్నారు.
వరంగల్ బీఆర్‌ఎస్ సభను ఆటంకపరిచారు.. ప్రజలను ఎండలో నిలబెట్టిన ఆర్టీవోలకు దెబ్బలొక్కటే తక్కువైనయి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర పార్టీల సభలను అడ్డుకోలేదు… కాంగ్రెస్ వాళ్లు కూడా సమావేశాలు, సభలు పెడుతారు. దానికి బదలా ఉంటుంది అని స్పష్టం చేశారు.
తాను లాఠీ పట్టుకొని ట్రాఫిక్ డ్యూటీ చేశానని చెప్పారు. వరంగల్ రోడ్డుకు ప్రెజర్ ఎక్కువ ఉంటుందని ముందే చెప్పాం… ట్రాఫిక్ పోలీసులు చేతులెత్తేస్తే ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, నేను లాఠీ పట్టుకొని హసన్‌పర్తి, ఎల్లాపూర్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేశాం అన్నారు. 200 ఎకరాల్లో చెట్లు నరికామని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు..ఇంతకన్నా తప్పుడు కామెంట్ ఉంటుందా చెప్పాలన్నారు.
Also Read:ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి: కవిత

