- Advertisement -
రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమా లుక్‌ని రివీల్ చేయగా చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ ఒక్క తెలుగులోనే 24 గంటల్లోపే 30 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఇక అన్ని భాషల్లో కలిపి 35 మిలియన్స్ దాటింది.
పెద్ది గ్లింప్స్ వ్యూస్ తో అల్లు అర్జున్ పుష్ప 2, దేవర రికార్డులను బద్దలు కొట్టాడు. పాన్ ఇండియా వైడ్ చూస్తే మాత్రం యష్ టాక్సిక్ గ్లింప్స్ 36 మిలియన్స్ వ్యూస్ తో ఫస్ట్ ప్లస్ లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్ పుష్ప 2 ని బీట్ చేసి రెండో ప్లేస్ లో నిలిచింది.
- Advertisement -

