ఎంపీ సంతోష్ కుమార్‌కు పర్యావరణ ప్రేమికుడి లేఖ..

129
manthani

ఎంపీ సంతోష్ కుమార్‌కు లేఖ రాశారు పర్యావరణ ప్రేమికుడు పెద్దపల్లి జిల్లా మంథని రావుల చెరువుకట్టకు చెందిన కృష్ణమూర్తి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రొత్సాహంతో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంతో తెలంగాణ మరింత అభివృద్ధి చెంది సిరి,సంపదలతో ఉండగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ పవిత్రకార్యంలో భాగంగా ఉడత భక్తి సాయంగా మా ఊరిలో గత సంవత్సరం మా ఇంటి ముందు చెట్టు నాటించానని తెలిపారు. వివిధ పేపర్ల విలేకరులు,మున్సిపల్ చైర్ పర్సన్ భర్త చూసి చాలా సంతోషించారని తెలిపారు. ఈ సంవత్సరం మా ఇంటి పక్క దేవాలయంలో పుష్ప,పత్ర,కాయ చెట్లను నాటించి వాటికి ట్రీ గార్డ్స్,ఎరువులు మొదలగు వాటిని స్వంత ఖర్చులతో చేయించానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ,వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు సహాయపడుతున్నానని ఈ చెట్లను చూసి తనను ఆశీర్వదించాలని కృష్ణమూర్తి కోరారు.