సూర్యకుమార్ మెరుపులు…ముంబై భారీ స్కోరు

143
mi

ఐపీఎల్‌-2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక తొలి ఓవర్‌ నుండే దూకూడుగా ఆడుతున్న ముంబై పవర్‌ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.

ఓవర్‌కి 10 రన్స్ తగ్గకుండా పరుగులు రాబట్టారు. డికాక్ 23, రోహిత్ శర్మ 35 పరుగులు చేసి ఔటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాజస్ధాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం సూర్యకుమార్ 36,కృనాల్ పాండ్యా 1 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

మరోవైపు రాజస్థాన్‌ జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు. కార్తీక్‌ త్యాగీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. రాబిన్‌ ఉతప్ప, జయదేవ్‌ ఉనద్కత్‌, రియాన్‌ పరాగ్‌లను తుదిజట్టు నుంచి తప్పించారు. యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌లను ఎంపిక చేసినట్లు స్మిత్‌ వివరించాడు.