యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ ను అందించిన ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు నా పై నమ్మకంతో ఇంత పెద్ద సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చారు. పెదకాపు అంటే సామాన్యుడి సంతకం. ఆ పాత్రకు నేను సెట్ అవుతానని ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. నేను హీరోగా ఇంత పెద్ద సినిమాని నిర్మించిన మా బావగారికి జీవితాంతం రుణపడి వుంటాను. మొదటి సినిమా అందరికీ మెమరబుల్. అలాంటి మెమరీస్ అన్నీ ఇందులో వున్నాయి,. వీటన్నిటికీ కారణం మా దర్శకుడు శ్రీకాంత్ గారు. చోటా కె నాయుడు గారు నన్ను చాలా అందంగా చూపించారు. చాలా ప్రోత్సహించారు.మా కష్టానికి తగిన ఫలితం మీరు ఇస్తారని, ఆ ఫలితం మాకు ఆనందాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ధన్యవాదాలు. విరాట్ .. కొత్త కుర్రాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇందులో కొత్తగా ఫీలవ్వొద్దని విరాట్ కి కూడా చెప్పాను. ఒక కొత్తకుర్రాడిగా నువ్వు చేస్తేనే ఈ కథ అందరికీ దగ్గర అవుతుందని చెప్పాను. దీనికి సామాన్యుడి సంతకం అని వూరికే పెట్టలేదు. ఇది విరాట్ కోసం పుట్టిందని తనతో తొలిసారి మాట్లాడినప్పుడు చెప్పాను. ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుందని నచ్చుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Also Read:టీడీపీకి జగన్ పూర్తిగా చెక్ పెట్టినట్లేనా ?
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెదకాపు-1 నా నాల్గవ సినిమా. గతంలో చేసిన మూడు సినిమాలు వేరు .. పెదకాపు వేరు. ఈ సినిమాతో చాలా రోజులు జర్నీ చేశాను. ఈ జర్నీ నాతో పాటు ప్రయాణించిన అందరికీ థాంక్స్ చెప్పడం నా బాధ్యత. నాగేశ్వరరావు గారు ప్రొడక్షన్ సైడ్ అన్నీ చక్కగా చూసుకునేవారు. తనకి సినిమా అంటే చాలా ఇష్టం. ఛోటా గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఈ ప్రయాణంలో ఆయనపై గౌరవం పెరిగింది. మనకి బయట కనిపించే చోటా వేరు లొకేషన్ లో చోటా వేరు. పని పట్ల చాలా అంకితభావంతో వుంటారు. భవిష్యత్ లో సినిమా తీస్తే నా మొదటి ఆప్షన్ ఆయనే. పీటర్ మాస్టర్ మరో మెయిన్ పిల్లర్. ఆయనకి సినిమా తప్ప మరో ఆలోచన వుండదు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.మీరు ఏది ఇచ్చిన తీసుకోవడానికి సిద్ధంగా వుంటాను. ఒక మనిషి కావచ్చు.. కుటుంబం, సమూహం, ప్రాంతం.. కావచ్చు. నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని వుండే ప్రతి కాపు కి ఈ సినిమా అంకితం అన్నారు.
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. పెదకాపు తో నాకు కొత్త గౌరవం వస్తుందనే నమ్మకం వుంది. సినిమా చూసిన తర్వాత అది మీరు ఏకీభవిస్తారు. ఇందులో అక్కమ్మ అనే అద్భుతమైన పాత్ర ఇచ్చిన శ్రీకాంత్ గారికి థాంక్స్. ఈ సినిమాతో నన్ను అందరూ అదే పేరుతో పిలుస్తారనే నమ్మకం వుంది. నిర్మాత రవీందర్ రెడ్డి గారి కృతజ్ఞతలు. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాతో కొత్త శ్రీకాంత్ అడ్దాల గారిని చూస్తారు. ఆయన నటన కూడా అద్భుతంగా చేశారు. విరాట్ ని అందరూ ప్రభాస్ తో పోలుస్తున్నారు. తను కూడా చాలా కష్టపడ్డారు. తప్పకుండా బిగ్ స్టార్ అవుతారు. ప్రగతి, బ్రిగడ అందరూ చాలా అద్భుతంగా నటించారు. 29న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.
Also Read:ప్చ్.. పాన్ ఇండియా పిచ్చి ముదిరింది