పల్లీలతో గుండె వ్యాధులకు చెక్!

69
- Advertisement -

మాంసాహారం తర్వాత ప్రోటీన్ ఎక్కువగా లభించే శాకాహార పదార్థాలలో వేరుశనగ ( పల్లీలు ) మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్య కరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఇ, వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. బలహీనంగా వారు ప్రతిరోజూ పల్లీలు తినడం వల్ల కండరాలు బలం పొందుకుంటాయి. ఇంకా ఎముకలు కూడా దృఢంగా మారతాయి. నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి పల్లీలు ఎంతో మేలు చేస్తాయట. ఇందులో ఉండే మెగ్నీషియం, కాపర్ వంటి మూలకాలు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి.

ఇంకా రక్తంలో షుగర్ కంట్రోల్ చేసి హైబీపీ, లోబీపీ లను అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి పల్లీలు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. ఇంకా ప్రతిరోజూ వేరుశనగలు తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట. కాబట్టి ప్రతిరోజూ పల్లీలు తినడం వల్ల ఆయా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. వేరుశనగ ఎక్కువ తినడం వల్ల నష్టాలు కూడా అధికంగానే ఉన్నాయి. పడగడుపున పల్లీలను ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. అంటే కాకుండా అలెర్జీ, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొందరు పల్లీలు తిన్న వెంటనే నీరు తాగుతుంటారు ఇలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పల్లీలు తిన్న తరువాత 15-20 గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. ముఖ్యంగా పచ్చిగా ఉన్న పల్లీలను అమితంగా అసలు తినరాదని ఆహార నిపుణులు

Also Read:Harishrao:మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే

- Advertisement -