- Advertisement -
సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా కెమెరా డిపార్ట్‌మెంట్ సభ్యుడు షేర్ చేసిన ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు షూటింగ్ తిరిగి ప్రారంభమైందని టీం సభ్యుడు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ లేకుండా కొన్ని రోజులు చిత్రీకరణ కొనసాగించగా ఈ వారంలో పవన్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:PV: ఢిల్లీలో పీవీ విగ్రహాం ఏర్పాటు!
- Advertisement -

