ఢిల్లీ అల్లర్లను ఖండించిన క్రికెటర్లు..

296
india cricketers
- Advertisement -

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లలో చనిపోయిన వారిసంఖ్య 27కు చేరుకోగా 250 మంది గాయాలపాలయ్యారు.

తాజాగా ఈ అల్ల‌ర్ల‌ను ఖండించారు భార‌త మాజీ క్రికెట‌ర్లు యువీ, సెహ్వాగ్‌, ట‌ర్బోనేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్. సోష‌ల్ మీడియా వేదిక‌పై అల్ల‌ర్ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన వీరు అంతా సంయమనం పాటించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

డిల్లీ బ‌ర్నింగ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేసిన యువీ…. ఢిల్లీ అల్ల‌ర్లు విషాద‌క‌ర‌మైన‌వ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ శాంతి, సామ‌రస్యాల‌తో ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. ఒక‌రిపైన ఒకరికి ప్రేమ‌, గౌర‌వం చూపించాల్సిన అవ‌స‌రమిద‌ని ట్వీట్ చేశాడు.

అంద‌రూ శాంతియుతంగా ఉండాల‌ని ఢిల్లీ వాసుల‌ను ట్విట్టర్ ద్వారా కోరాడు సెహ్వాగ్ . మ‌న‌లో మ‌నం త‌గ‌వు ప‌డ‌టం త‌గ‌ద‌ని, అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -